Phone Tapping Case: హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
జూన్ 1వ తేదీన విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు.
Read Also: Retired Employees: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Phone Tapping Case Probe Expedited: Yennam Srinivas Reddy to Appear for Questioning on June 1st.తదనంతరం మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం విచారణను అధికారులు వేగవంతం చేశారు.
Phone Tapping Case: జూన్ 1న వాంగ్మూలం ఇవ్వనున్న ఎమ్మెల్యే
జూన్ 1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి విచారణ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
మహిళా సంఘాలకు రూ.2.18 కోట్ల రుణాలు.. రామాయంపేటలో ఘన లోన్ మేళా

