Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు.. ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ రికార్డ్!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు.. ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ రికార్డ్!

వార్త 1 week ago

Telangana phone tapping case:తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ బృందం వీరి నుంచి కీలక వివరాలను సేకరించింది. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: Registrations Department Revenue: రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,698.96 కోట్లు

 MLAs in the Telangana Phone-Tapping Case

ఆధారాలను సేకరిస్తున్న సిట్ బృందం

ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. నేడు జరిగిన విచారణలో ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పక్కా ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా సిట్ ముందుకు వెళ్తోంది.

Telangana phone tapping case:ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ నమోదు

గతంలో ఇచ్చిన నోటీసులకు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపి నేడు వారిని పిలిపించారు. అధికారులు సేకరించిన సాంకేతిక సాక్ష్యాలను ఎమ్మెల్యేల ముందు ఉంచి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం ఎలా వాడుకున్నారనే అంశంపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha