Tamannaah: నటి తమన్నా భాటియా కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వ్యవహారం ఇప్పుడు సినీ, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవర్ సోప్స్ సంస్థకు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన రూ.
కోటి నష్టపరిహారం దావాను కోర్టు తోసిపుచ్చింది.ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సదరు సంస్థ తన ఫోటోలను వాడుకుందని, దీనివల్ల తనకు నష్టం జరిగిందని తమన్నా వాదించారు. అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ న్యాయమూర్తులు పి. వేల్మురుగన్, కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also:Sandeep Kishan: టాలీవుడ్‌లో 16 ఏళ్లు.. భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సందీప్ కిషన్
వివాదం నేపథ్యం
2008లో తమన్నా ‘పవర్ సోప్స్’ సంస్థతో ఒక ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం 2009 అక్టోబర్‌తో ముగిసింది. అయితే,ఒప్పందం ముగిసిన తర్వాత కూడా (2010-2011 కాలంలో) కంపెనీ తన ఫోటోలను సోప్ ప్యాకింగ్‌లపై, ప్రకటనల్లో, ఇంటర్నెట్‌లో వాడుకుందని తమన్నా ఆరోపించారు.దీనివల్ల ఇతర బ్రాండ్లతో తాను చేసుకునే ఒప్పందాలకు నష్టం కలిగిందని పేర్కొంటూ రూ. 1 కోటి నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.
Tamannaah Bhatia case against Power Soaps
Tamannaah: కోర్టు తీర్పులో ముఖ్యాంశాలు
గతంలో ఒక సింగిల్ జడ్జి ఈ కేసును కొట్టివేయగా, తమన్నా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తాజాగా ఆ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు.. తమన్నా సమర్పించిన సోప్ కవర్లు, కొనుగోలు పత్రాలు నమ్మదగ్గవిగా లేవని అభిప్రాయపడింది. కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను వాడిందని నిరూపించే బలమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, గతంలో ఇచ్చిన తీర్పునే సమర్థించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

