Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నీళ్లు తెప్పిస్తున్న సాయి పల్లవి 'ఏక్ దిన్' ట్రైలర్!

కన్నీళ్లు తెప్పిస్తున్న సాయి పల్లవి 'ఏక్ దిన్' ట్రైలర్!

వార్త 2 months ago

Ek Din Trailer Release: స్టార్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఏక్ దిన్' (Ek Din).

అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న, ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Read Also:TIME 100 List 2026: టైమ్ జాబితాలో చోటు దక్కించుకున్న పిచాయ్, రణ్‌బీర్, వికాస్ ఖన్నా

Ek Din Trailer Release: బాలీవుడ్‌లో సాయి పల్లవి మార్క్.. జునైద్ ఖాన్‌తో ఎమోషనల్ జర్నీ

సౌత్ ఇండియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న 'ఏక్ దిన్' (Ek Din) చిత్రంతో ఆమె హిందీ తెరకు పరిచయం కాబోతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరోయిన్ (సాయి పల్లవి) ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. అయితే తనను ప్రేమించిన హీరో (జునైద్) అమెతో ఒక్కరోజు అయిన ప్రేమతో గడపాలని కోరుకుంటాడు. అయితే ఆ ఒక్క రోజు వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది కథాంశం. తెలుగులో ఈ చిత్రం ఒక రోజు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా.. అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నాడు. సాయి పల్లవి హిందీలో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా మే 01న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టాలీవుడ్‌లో 16 ఏళ్లు.. భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సందీప్ కిషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha