Sandeep Kishan: టాలీవుడ్‌లో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ (Sandeep Kishan) సినీ ప్రయాణం 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్ 'పవర్ పేట' (Power Peta)ను అధికారికంగా ప్రకటించారు.
Read Also: TIME 100 List 2026: టైమ్ జాబితాలో చోటు దక్కించుకున్న పిచాయ్, రణ్‌బీర్, వికాస్ ఖన్నా
Sandeep Kishan: ఆకట్టుకుంటున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్
హీరో సందీప్ కిషన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన తదుపరి భారీ చిత్రం 'పవర్ పేట' (Power Peta)ను ప్రకటించారు. 'యాత్ర', 'ఆనందో బ్రహ్మ' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ (విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక మేకోవర్ అవ్వబోతున్నారు.తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది.
రక్తంతో తడిసిన చదరంగం బోర్డు, విరిగిపోయిన పావులు, వాటి మధ్య నలిగిపోయిన ఒక రోజా పువ్వు.. ఇవన్నీ చూస్తుంటే వ్యూహాలు, త్యాగాలు, అధికార దాహం చుట్టూ కథ తిరుగుతుందనిపిస్తోంది. "Love. Honour. Politics." అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మెయిన్ థీమ్స్‌ను స్పష్టం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

