Dailyhunt
ఫుడ్‌లో పురుగులు.. కంపెనీపై భారీ జరిమానా

ఫుడ్‌లో పురుగులు.. కంపెనీపై భారీ జరిమానా

వార్త 2 weeks ago

వందేభారత్‌లో ఫుడ్ వివాదం

Vande bharat train food issue : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహార నాణ్యతపై మరోసారి వివాదం చెలరేగింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్ రైల్లో ప్రయాణికుడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

IRCTC కఠిన చర్య

ఈ ఘటనపై భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెంటనే స్పందించింది. ప్రయాణికుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. ఫుడ్ సరఫరా చేసిన కాంట్రాక్ట్ కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధించడంతో పాటు వారి కాంట్రాక్టును కూడా రద్దు చేసింది.

Read Also:Anupama Parameswaran: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నటి అనుపమ?

ప్రయాణికుల ఆందోళన

ప్రీమియం రైళ్లలో అధిక ధరలు చెల్లించి ప్రయాణించే (Vande bharat train food issue) ప్రయాణికులకు ఇలాంటి నాసిరకమైన ఆహారం అందించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు కిచెన్‌లపై తరచుగా తనిఖీలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హిందీ సరిగ్గా రాకపోయినా అమితాబ్‌ను మెప్పించిన సుదీప్.. ఆ సీక్రెట్ ఏంటంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha