Ludhiana Factory News: పంజాబ్‌లోని లుధియానాలో భారీ విషాదం చోటుచేసుకుంది. లుధియానా పరిధిలోని గాస్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక టూల్ మాన్యుఫ్యాక్చరింగ్ (పరికరాల తయారీ) ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి ప్రమాదకర విషవాయువు లీక్ అయింది.
ఈ గ్యాస్ పీల్చడం వల్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు.
Read Also :Kurnool crime: కన్నకొడుకును హత్య చేసిన తల్లి, కేసు వెలుగులోకి రాగానే అనుమానాస్పద మృతి
Ludhiana Factory News: చికిత్స పొందుతూ ముగ్గురు మృతి.. విషాదంలో కుటుంబాలు!
Three people died due to a toxic gas leak at a tool factory in Giaspura, Ludhiana, Punjab, on Sunday night.
ఫ్యాక్టరీలో కార్మికులు స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన తోటి సిబ్బంది, యాజమాన్యం వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ముగ్గురు కార్మికులు మరణించారు. మిగిలిన నలుగురు కార్మికులు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో తండ్రీకొడుకులు.. కన్నీరుమున్నీరవుతున్న బంధువులు
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో తండ్రీకొడుకులు కూడా ఉండటం స్థానికంగా తీవ్ర కలచివేస్తోంది. మృతులను గాస్‌పురా ప్రాంతానికే చెందిన మాన్ సింగ్, అలాగే అతని కుమారుడు అమిత్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన మరొక కార్మికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, అతని గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గ్యాస్ లీకేజీకి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

