Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నకొడుకును హత్య చేసిన తల్లి, కేసు వెలుగులోకి రాగానే అనుమానాస్పద మృతి

కన్నకొడుకును హత్య చేసిన తల్లి, కేసు వెలుగులోకి రాగానే అనుమానాస్పద మృతి

వార్త 1 week ago

Kurnool crime: కర్నూలు జిల్లాలో అత్యంత కిరాతకమైన, నమ్మశక్యం కాని ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక కన్నతల్లి, ప్రియుడితో కలిసి కన్నకొడుకును దారుణంగా హతమార్చింది.

అంతటితో ఆగకుండా, తనకేమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత పోలీసులే విచారణ సరిగ్గా చేయడం లేదంటూ ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

Read Also : Kollu Ravindra Comments: డీఎస్సీపై జగన్ ఆరోపణలు నిజమా? మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీతో షాక్!

 Mother who murdered her son dies under suspicious circumstances as soon as the case comes to light

Kurnool crime: సిట్ విచారణతో వెలుగులోకి నిజాలు

గత ఏడాదిన్నర కాలంగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ దారుణం. సిఐడి విచారణతో ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడ్డాయి. అయితే, ఈ హత్యకు సంబంధించిన అసలు నిజం తేలిన కొద్ది గంటల్లోనే, నిందితురాలైన ఆ తల్లి కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

అక్రమ సంబంధం

ఈ ఘోరానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బడినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మ, చిన్నమల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చిన్నమల్లయ్య మరణించారు. భర్త చనిపోయిన తర్వాత గంగమ్మకు ఆదోని మండలం జె.హోసళ్ళి గ్రామానికి చెందిన దర్గాప్ప అనే బంధువుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

దర్గాప్ప తరచూ తమ ఇంటికి వస్తూ పోతూ ఉండటం గంగమ్మ పెద్ద కుమారుడైన వీరేశ్ (17)కు అస్సలు నచ్చలేదు. కన్నతల్లి ప్రవర్తనను, దర్గాప్ప రాకపోకలను వీరేశ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయమై వీరేశ్ తన తల్లి గంగమ్మతో, ఆమె ప్రియుడు దర్గాప్పతో పలుమార్లు తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆ తల్లి, ప్రియుడితో కలిసి కన్నకొడుకును అంతమొందించేందుకు ప్లాన్ వేసి ఈ దారుణానికి ఒడిగట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha