Dailyhunt
గాజువాక మౌనిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

గాజువాక మౌనిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

వార్త 1 week ago

గాజువాక మౌనిక కేసులో సంచలన మలుపు

Gajuwaka mounika murder : విశాఖపట్నంలోని గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తొలుత నిందితుడు రవీంద్ర తన ఫ్లాట్‌లోనే హత్య జరిగిందని చెప్పినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. హత్య అతడి స్నేహితుడి ఇంట్లో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

సీసీటీవీ ఫుటేజీతో బయటపడిన నిజం

మార్చి 29న మౌనికను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి గొడవలో చంపేశానని రవీంద్ర తొలుత చెప్పాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా మౌనిక లోపలికి వెళ్లిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

Read Also: Jaladhara-Jalaharati Program Nellore: సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

 Gajuwaka mounika murder

ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం తరలింపు

నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు మౌనికతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లయిన విషయం బయటపడకూడదనే ఉద్దేశంతో స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి గొడవలో ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. తర్వాత వాటిని జీడితోటలో కాల్చివేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

NH. 544డి పరిధిలో భూసమస్యలు పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha