Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

వార్త 2 months ago

Jaladhara-Jalaharati Program Nellore: జిల్లాలో నీటి వనరుల సమర్థ వినియోగం, భూగర్భ జలాల పెంపుదలకు జలధార-జలహారతి - సాగు నీటి సంఘాల బాధ్యత (JJSSB) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నందు నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాలోని వివిధ బేసిన్లు, ఉప బేసిన్లలో నీటి లభ్యతపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Read Also:GST notice barber : రూ.72 లక్షల బకాయిలు చెల్లించాలన్న నోటీసు

Jaladhara-Jalaharati Program Nellore: బేసిన్ల అనుసంధానంపై నజర్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు సమగ్ర, స్థిరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అధిక నీరు లభ్యమయ్యే బేసిన్లను నీటి కొరత ఉన్న బేసిన్లతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ప్రస్తుత కాస్కేడ్ వ్యవస్థలను మెరుగుపరచి, సాధ్యమైనచోట దిగువ సాగు చెరువులకు విస్తరించాలని తెలిపారు. దెబ్బతిన్న, లీకేజీ ఉన్న చెక్ డ్యామ్‌లను ప్రాధాన్యంతో పునరుద్ధరించడంతో పాటు, అనుకూల ప్రదేశాల్లో కొత్త సాగు నీటి చెరువుల ఏర్పాటు సాధ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
చెరువుల కట్టలను బలోపేతం చేస్తూ పునరుద్ధరణ పనులు చేపట్టాలని, కాలువలలోని పూడికను తొలగించాలని, తూములు, కలుజుల మరమ్మత్తులు వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దిష్ట కాలంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నాయక్, సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎస్ఎస్ఎల్సీ & ఎస్బీ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, జలవనరుల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీరర్లు, భూగర్భ జల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మరణించిన పోలీసు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కుల అందజేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha