Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాలివాన కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు

గాలివాన కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన పలు విమానాలు దారి మళ్లింపు

వార్త 2 months ago

Shamshabad Airport Updates:హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా నగరంలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

శుక్రవారం రాత్రి కురిసిన భారీ గాలివాన కారణంగా రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. తక్కువ విజిబిలిటీ కారణంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్ అనుమతి నిరాకరించింది.

Read Also : Dundigal Air Force Academy : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్​నాథ్​

 Several flights bound for Shamshabad diverted due to a windstorm.

Shamshabad Airport Updates: బెంగళూరుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి విమానం

ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానానికి శంషాబాద్‌లో ల్యాండింగ్ అనుమతి దక్కలేదు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు సీఎం విమానాన్ని బెంగళూరుకు తరలించారు. కేవలం ముఖ్యమంత్రి విమానమే కాకుండా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన మరికొన్ని విమానాలను కూడా అధికారులు ఇతర నగరాలకు దారిమళ్లించారు.

శనివారం కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు వెల్లడించారు. దట్టమైన మబ్బులు, ఈదురుగాలుల కారణంగా పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయగా.. గాల్లో ఉన్న మరికొన్ని విమానాలను అత్యవసరంగా ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. వీటిలో ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగోకు చెందిన డొమెస్టిక్ఇంటర్నేషనల్ సర్వీసులు ఉన్నాయి.

దారి మళ్లించిన విమానాల పూర్తి వివరాలు ఇవే:

విమాన సంస్థ & నెంబర్ఎక్కడి నుండి..ఎక్కడికి దారి మళ్లించారు?
ఎయిరిండియా (AI 2875)ముంబయి - హైదరాబాద్బెంగళూరు
స్పైస్‌జెట్ (S5 174)పుణే - హైదరాబాద్బెంగళూరు
స్పైస్‌జెట్ (S5 197)నాందేడ్ - హైదరాబాద్బెంగళూరు
ఇండిగో (6E 1028)సింగపూర్ - హైదరాబాద్బెంగళూరు
ఇండిగో (6E 717)ఢిల్లీ - హైదరాబాద్బెంగళూరు
ఇండిగో (6E 5236)ముంబయి - హైదరాబాద్బెంగళూరు
ఇండిగో (6E 2083)నియామే - హైదరాబాద్బెంగళూరు
ఇండిగో (6E 6683)వారణాసి - హైదరాబాద్చెన్నై
ఇండిగో (6E 638)బెంగళూరు - హైదరాబాద్నాగ్‌పూర్

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha