Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

వార్త 1 week ago

Gachibowli Flyover Accident: హైదరాబాద్‌ ఐటీ హబ్ పరిధిలోని గచ్చిబౌలిలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక AMB మాల్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వచ్చిన ఒక స్కూటీని, వేగంగా వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది.

ఈ భీకర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Read also: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం.. ఈసారి 69 అడుగుల మహా గణనాథుడు

 Horrific accident on Gachibowli AMB flyover… two dead.

Gachibowli Flyover Accident: అక్కడికక్కడే ఇద్దరు మృతి.. బుల్లెట్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న స్కూటీని, సరైన మార్గంలో వస్తున్న బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన తీవ్రతకు స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఇక బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా, గాయపడిన వినోద్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై స్థానిక పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వాహనాలు ప్రతిరోజూ యథేచ్ఛగా రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తుంటాయని వారు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి ఉల్లంఘనలపై ముందే స్పందించి, కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయేవాళ్లు కాదని స్థానికులు వాపోతున్నారు. ఫ్లైఓవర్లపై నిఘా పెంచాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

చౌట్కూరులో ఘనంగా మొహరం వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha