KKR vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (సోమవారం) కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా, సొంత గడ్డపై తొలి గెలుపును నమోదు చేయాలని కోల్‌కతా తహతహలాడుతోంది.
Read Also:Police Football Winners: ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ విజేతలుగా సిఐఎస్ఎఫ్, అసోం రైఫిల్స్
హెడ్-టు-హెడ్ రికార్డులు (Head-to-Head)
గణాంకాల పరంగా చూస్తే కోల్‌కతాదే పైచేయిగా ఉంది:
- మొత్తం మ్యాచ్‌లు: 35
- కోల్‌కతా విజయం: 21
- పంజాబ్ విజయం: 13
- డ్రా/ఫలితం తేలనివి: 01
KKR vs PBKS IPL 2026 Live Today
KKR vs PBKS: జట్ల బలాబలాలు – విశ్లేషణ
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): బ్యాటింగ్ బాగున్నా, అంక్రిష్ రఘువంశీ (వరుసగా రెండు హాఫ్ సెంచరీలు), అజింక్య రహానే, ఫిన్ అలెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ మిడిల్ ఆర్డర్‌లో రింకు సింగ్ నుండి మెరుపులు రావాల్సి ఉంది.ముజరబానీ మినహా మిగిలిన పేసర్లు వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి విఫలమవుతున్నారు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి కూడా రాణించకపోవడం మైనస్. నేడు ఉమ్రాన్ మాలిక్ లేదా రచిన్ రవీంద్ర తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
గత ఏడాది కోల్‌కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కెప్టెన్‌గా ఈడెన్ బరిలోకి దిగుతున్నారు. కేకేఆర్ పై ఆయనకు అద్భుతమైన రికార్డు ఉంది.కూపర్ కానలీ కూడా రెండు మ్యాచ్‌లలో 108 పరుగులు చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా బాగా రాణిస్తున్నాడు. పంజాబ్ జట్టులో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ వంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్లు కూడా ఉన్నారు.
తుది జట్లు అంచనా
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), రికు సింగ్ (వైస్ కెప్టెన్), ఫిన్ అలెన్, తేజస్వి దహియా, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, సార్థక్ రంజన్, టిమ్ సీఫెర్ట్, రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రాహూన్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, కామెరూన్, కామెరూన్ గ్రీన్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ, నవదీప్ సైనీ, ప్రశాంత్ సోలంకి, ఉమ్రాన్ మాలిక్.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, హర్నూర్ సింగ్, మిచెల్ ఓవెన్, విష్ణు వినోద్, నిహాల్ వధేరా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్, లాకీ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ ఫెర్గూసన్, హర్‌ప్రీత్ ఫెర్గూసన్, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, ముషీర్ ఖాన్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, పైలా అవినాష్, శశాంక్ సింగ్.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
చెన్నైకు 'ఇదేం ఖర్మ'.. ఐదుసార్లు ఛాంపియన్ల పరిస్థితి పాతాళానికి

