Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గంజాయి మత్తులో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య

గంజాయి మత్తులో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య

వార్త 2 months ago

Warangal Crime: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. 21 ఏళ్ల యువతి మృతి వెనుక గంజాయి ముఠా హస్తం ఉందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆందోళనతో వర్ధన్నపేట ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

Read Also: Mullugummi Waterfall Accident: సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది!

Warangal Crime: కిడ్నాప్

బుధవారం రాత్రి నిందితులు యువతిని కిడ్నాప్ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటపడుతుందనే భయంతో ఆమెను ఉరివేసి హత్య చేశారని బంధువులు పేర్కొంటున్నారు.నిందితులు ఎప్పుడూ గంజాయి మత్తులో ఉంటూ గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని వారి ఆగడాలే ఈరోజు ఒక అమాయక యువతి ప్రాణం తీశాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు.

 Ganja gang rape and murder allegations in Warangal

అయితే ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేట వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కాల్ డేటా, క్షేత్రస్థాయి ఆధారాలను సేకరిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha