Chilipally Theft Update: పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు 5 ఇండ్లలో బీభత్సం సృష్టించారు. నాలుగు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించి 100 తులాలకు పైన బంగారం, కిలో వెండిని అపహ రించారు.
వివరాల్లోకి వెళితే.. రాయిని రాములు ఇంట్లోనే వంద తులాలకు పైన బంగారు నగలు, కిలో వెండి అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఏసి రెడ్డి మాణిక్ రెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారం, జగ్గు చిన్న మల్లారెడ్డి ఇంట్లో మూడు మాసాల బంగారం నగలు, జగ్గు అరుంధతి ఇంట్లో కమ్మలు, పట్టగొలుసులు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతానికి సంఘటన స్థలాన్ని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డిలు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
Read Also:Chilipally Theft: దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!
Chilipally Theft Update:పోలీసుల యాక్షన్ ప్లాన్

ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వంద తులాలకు పైగా బంగారం, కిలో వెండి దొంగలించిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. దొంగతనం జరిగిన ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన విధానాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగాసంఘటన స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు.అనంతరం మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు. బాధితుల నుంచి దరఖాస్తు తీసుకుని దొంగతనం కేసు చేదించడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన వెంట అల్లదుర్గం సిఐ రేణుకరెడ్డి, పెద్ద శంకరంపేట, అల్లదుర్గం ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ లు ఉన్నారు.


Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

