Elamanchili Road Accident: మండలంలోని గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుం బాలలో తీరని విషాదం నింపింది. రూరల్ ఎస్సై ఉపేంద్ర స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం రాత్రి సుమారు 11:45 నిమిషాలకు పోతిరెడ్డి పాలెం కోడలి వద్ద జాతీయ రహదారిపై యూటర్న్ తీసు కుంటున్న పల్సర్ మోటార్ సైకిల్ ను అనకాపల్లి నుండి తుని వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొంది.
Read Also: Breaking news: AP New Map 28 Districts: అమరావతి రాజధానిగా నూతన మ్యాప్ విడుదల
Horrific Road Accident in Yelamanchili.. Three Youths Dead
Elamanchili Road Accident: ప్రమాద వివరాలు
ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్ హైవే కి చెందిన అంబులెన్స్ లో బాధితులను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24) ఇలప గోవింద్ (25) ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదహారేళ్ల మైనర్ బాలుడు బంగారు దుర్గాప్రసాద్ కూడా చికిత్స పొందుతూ మరణించాడు. మృతులలో నాని మృతదేహాన్ని ఎలమంచిలి శవాగారానికి తరలించగా అనకాపల్లి ఆసుపత్రి వద్ద గోవిందు దుర్గాప్రసాద్ లను మార్చురీలో భద్రపరిచారు.
స్వగ్రామాలలో విషాదఛాయలు
అల్లరి ముద్దుగా పెరిగిన యువకులు కళ్ళముందే మిగతాజీవులుగా పడి ఉండడంతో వారి స్వగ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంగారు నాని, ఎల్లపు గోవింద్
బంగారు దుర్గాప్రసాద్ ముగ్గురు ఒకే సామాజిక వర్గం ఎస్సీ రెల్లి సామాజిక వర్గం చెందినవారు. ముగ్గురూ కలిసి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బంగారు నాని కి నాలుగు సంవత్సరాలు బాబు రెండు
సంవత్సరాలు పాప ఉన్నారు. ఎల్లపు గోవిందు ఇటీవల పెళ్లయింది. బంగారు దుర్గాప్రసాద్ కి తమ్ముడు ఉన్నాడు కుటుంబానికి ఆర్థిక చేయి అందించే ముగ్గులు చనిపోవడంతో మూడు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. నిందితుడిని వదలొద్దని ఆదేశం

