Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి

ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి

వార్త 3 weeks ago

Pakistan ambulance blast: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. థార్‌పార్కర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిలిపి ఉంచిన అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

ఈ దారుణ ప్రమాదంలో నవజాత శిశువుతో సహా మొత్తం పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి అంబులెన్స్ తీవ్రంగా ధ్వంసమవ్వడమే కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

Spain train accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 68 కి చేరిన మృతుల సంఖ్య

 Horrific accident: Oxygen cylinder explodes in an ambulance, 10 people killed

pakistan ambulance blast: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు మరియు ఒక నవజాత శిశువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు ఆసుపత్రికి చెందిన సిబ్బంది మరియు అక్కడ ఉన్న కొందరు స్థానికులు కూడా ఈ ప్రమాదానికి బలియ్యారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రపతి ఆసిఫ్ అలీ జర్దారీ సంతాపం..

ఈ ఘోర ప్రమాదంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించారు. అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలడానికి సాంకేతిక లోపమా లేదా పర్యవేక్షణ లోపమా అనే కోణంలో పోలీసులు మరియు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Epaper: epaper.vaartha.com

ఉక్రెయిన్‌లో ఘోర డ్రోన్ దాడి.. 13 మంది మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha