Visakhapatnam Car Accident: విశాఖపట్నం జిల్లాలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులోని గాండ్రిగుండం పరిధిలో ఉన్న సత్తారువు జంక్షన్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు.
Read Also :Nallamada Road Accident: చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకుల దుర్మరణం

Visakhapatnam Car Accident: ప్రమాద వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు
జాతీయ రహదారి-16 (NH-16) సర్వీస్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు, తన ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు ఇంజిన్‌లో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకునే సరికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఆనందపురం ఎస్ఐ శివ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో కారు నంబర్ ప్లేట్ ఊడిపోయి లారీకి అతుక్కుపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఆధారంగా మృతుని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తీవ్ర విషాదం: కూతురిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి!

