ఒక తల్లి దారుణానికి పాల్పడింది. కుమారుడి ఆరోగ్యం కోసం కన్న కుమార్తెను నరబలి ఇచ్చింది. ప్రియుడు, మంత్రగత్తెతో కలిసి కూతుర్ని చంపింది. తాంత్రిక పూజల కోసం కన్య రక్తం కావాలన్న మంత్రగత్తె బాలిక ప్రైవేట్ భాగంలో కర్రను చొప్పించింది.
జార్ఖండ్(Jharkhand)లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 24న కుసుంభ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. మరునాడు స్థానిక స్కూల్ వెనుక ఉన్న వెదురు తోటలో ఆమె మృతదేహం లభించింది. కాగా, శ్రీరామనవమి ఊరేగింపు తర్వాత తన కుమార్తె కనిపించలేదని బాలిక తల్లి అయిన 35 ఏళ్ల రేష్మి దేవి పోలీసులకు చెప్పింది. ధనేశ్వర్ పాశ్వాన్, అతడి స్నేహితులు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు తొలుత వారిపై పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Hyderabad IPAC Office Raids: హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఈడీ సోదాలు
Jharkhand
Jharkhand: దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
మరోవైపు మార్చి 26న జార్ఖండ్ డీజీపీ, హజారీబాగ్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు పరిశీలించిన పోలీసులు, మూఢనమ్మకం కారణంగా తల్లి తన కుమార్తెను నరబలి ఇచ్చినట్లు దర్యాప్తులో తెలుసుకుని షాక్ అయ్యారు. మార్చి 24న రాత్రివేళ రేష్మి దేవి తన ప్రియుడైన 40 ఏళ్ల భీమ్ రామ్‌తో కలిసి పూజ నెపంతో 12 ఏళ్ల కుమార్తెను తాంత్రికురాలి ఇంటికి తీసుకువెళ్లింది. ఆచారాల తర్వాత ఆ బాలికను సమీపంలోని వెదురు తోటలోకి తీసుకెళ్లారు. కుమార్తె కాళ్లను తల్లి పట్టుకోగా, భీమ్ రామ్ ఆమె గొంతు నొక్కి చంపాడు. ఆచారం కోసం కన్య రక్తం కావాలన్న మంత్రగత్తె శాంతి దేవి, ఆ బాలిక మర్మాంగంలో కర్రను చొప్పించింది. దీంతో భీమ్ రామ్ ఆ బాలిక తలపై రాయితో కొట్టాడు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని అక్కడ వదిలేసి వారు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. కుమారుడి అనారోగ్యం నయమవుతుందన్న మూఢనమ్మకం వల్ల కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి రేష్మి దేవి, ఆమె ప్రియుడు భీమ్ రామ్, తాంత్రికురాలు శాంతి దేవిని అరెస్ట్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
రాఘవ్ చద్దా అవుట్.. అశోక్ మిట్టల్ ఇన్: రాజ్యసభలో ఆప్ కొత్త వ్యూహం

