Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమితులయ్యారు.గురువారం (ఏప్రిల్ 2, 2026) నాడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారికంగా లేఖ రాసింది. ఈ మార్పు తక్షణమే అమలులోకి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: Kerala Elections 2026: కేరళలో రేవంత్ మార్క్ 'గ్యారెంటీ'లు: యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల
పంజాబ్ నుంచి ఎంపీగా ఉన్న అశోక్ కుమార్ మిట్టల్ (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు) ఇప్పుడు సభలో ఆప్ పక్ష ఉపనేతగా వ్యవహరిస్తారు.కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, సభలో పార్టీకి కేటాయించిన కోటా సమయం (Speaking Time) నుంచి రాఘవ్ చద్దాకు ప్రసంగించే అవకాశం ఇవ్వకూడదని కూడా ఆప్ ఆ లేఖలో కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Raghav Chadha Removal Rajya Sabha Deputy Leader
Raghav Chadha: ఎందుకీ నిర్ణయం?
పార్టీ ఈ మార్పుపై అధికారికంగా ఎలాంటి నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. అయితే రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, ముఖ్యంగా కేజ్రీవాల్ నేతృత్వంలోని బహిరంగ సభలకు చద్దా దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.రాజ్యసభలో పంజాబ్ నుంచి వచ్చిన ఎంపీలకు ప్రాధాన్యత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్‌కు రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉండగా, అందులో ఏడుగురు పంజాబ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల ప్రచారాల 'స్టార్ క్యాంపెయినర్' జాబితా నుంచి కూడా చద్దా పేరును ఆప్ తొలగించడం గమనార్హం.
అశోక్ మిట్టల్ స్పందన
తన నియామకంపై స్పందించిన అశోక్ మిట్టల్, ఇదొక సాధారణ ప్రక్రియ అని పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సభలో ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తానని తెలిపారు. గతంలో ఎన్‌డీ గుప్తా, ఆ తర్వాత చద్దా ఈ బాధ్యతలు నిర్వహించారని, ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయన వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

