Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పారాక్వాట్ గడ్డిమందును నిషేధించండి: మంత్రి తుమ్మల

పారాక్వాట్ గడ్డిమందును నిషేధించండి: మంత్రి తుమ్మల

వార్త 2 months ago

Telangana : రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ 24 ఎస్ఎల్ ప్రమాదకర గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

Read Also: Ammaku Aksharamala Program Telangana: మహిళల్లో అక్షరాస్యత పెంపునకు సెర్చ్ ప్రత్యేక చర్యలు

 Telangana: Ban paraquat herbicide: Minister Tummala

Telangana: సురక్షితమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ, పర్యావరణ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని స్పష్టం చేశారు. పారాక్వాట్ వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొం టున్నారని, అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని సభకు తెలిపారు.

ప్రజా రోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. పారాక్వాట్ వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాల్లో పారాక్వాట్ పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పారాక్వాట్కు ప్రత్యామ్నాయంగా అనేక గడ్డిమందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ అసెంబ్లీ కోరింది. ఈ తీర్మానం ద్వారా రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్య రక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పూర్తిస్థాయిలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha