Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గిరిజన యువతకు ఊరట.. పట్టాలెక్కనున్న రాజీవ్ యువ వికాసం పథకం

గిరిజన యువతకు ఊరట.. పట్టాలెక్కనున్న రాజీవ్ యువ వికాసం పథకం

వార్త 1 week ago

TG Rajiv Vikasam scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రాజీవ్ యువ వికాసం పథకం. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు బ్యాంకు రుణం మంజూరు చేస్తారు.

పథకం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు దీని అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని 91 వేల మంది గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో గిరి జనుల ఆర్థికాభివృద్ధికి రేవంత్ సర్కార్ రూ. 2,546.24 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు గిరిజన ఆర్థిక సహకార సంస్థ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ మొత్తంలో రూ.2,085 కోట్ల సబ్సిడీ కాగా మిగతా మొత్తం రూ.461.24 కోట్ల బ్యాంకు రుణంగా సమకూర్చనుంది.

Read also: Telangana-Germany Agreement: తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం..ఐటీ, ఏఐ రంగాల్లో సరికొత్త మైలురాయి

 Relief for tribal youth.. Rajiv Yuva Vikasam Scheme to be launched soon

TG Rajiv Vikasam scheme: వార్షిక ప్రణాళిక వివరాలు – లబ్ధిదారుల సంఖ్య

ఈ వార్షిక ప్రణాళికతో 1,36,184 మంది గిరిజన యువతకు లబ్ధి చేకూ ర్చేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. ఇందిరా సౌరగిరి జలవికాసం, రాజీవ్ యువ వికాసం, గ్రామీణ రవాణా పథకం, ఆదిమ గిరిజ నులకు జీవనోపాధి, గిరిజన రైతులకు యాంత్రీ కరణ పథకం, సీఎం ఎస్టీఈఐ, క్యూర్ ప్రాంతంలో ఆటోల రెట్రోఫిటింగ్, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు వంటివి ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజీవ్ యువ వికాసం కింద 91,687 మంది ఎస్టీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1,225.79 కోట్లు కేటాయించారు. ఇందులో రాయితీ నిమిత్తం .1000 కోట్లు, మిగతా రూ.225.79 కోట్లు బ్యాంకు రుణంగా ఉంటుంది. అలానే 13,897 మందికి జీవనోపాధి పథకం అమలు చేయబోతున్నారు. ఇందుకుగాను రూ.521.24 కోట్లు ఖర్చు చేయనుండగా, దీనిలో బ్యాంకు రుణం 311.24 కోట్లు, రాయితీ రూ.210 కోట్లను ఇస్తుంది.

ఆటోల రెట్రోఫిటింగ్, సీఎం ఎస్టీఈఐ పథకాలు

ఇక క్యూర్ ఏరియాలో 7,500 మంది లబ్దిదారుల ఆటోలను నూరు శాతం రాయితీతో రెట్రోఫిటింగ్ పథకం కింద పూర్తి స్థాయి విద్యుత్తు వాహ నాలుగా మార్చుతారు. ఇందుకు గాను రూ.150 కోట్లు వ్యయం చేయ నున్నారు. అంతేకాకుండా సీఎం ఎన్టీఈఐ పథకం ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చనున్నారు. దీని కోసం 100 యూనిట్లు మం జూరు చేయనున్నారు. మొత్తం రూ.200 కోట్లతో పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో సబ్సిడీ రూ.50 కోట్లు, బ్యాంకు రుణం రూ.130 కోట్లు. అయితే ఈ పథకంలో లబ్దిదారులు కూడా రూ.20 కోట్ల మేర భరించాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం గిరిజన యువత నైపు ణ్యాభివృద్ధి కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయ నుంది. ఇందులో 13 వేల మంది లబ్దిదారులకు నైపుణ్య శిక్షణ అందిస్తుంది. దీంతో పాటు, ఇం దిరా జలవికాసం కింద 10వేల మంది లబ్దిదా రులకు రూ.600కోట్ల ఖర్చుతో సోలార్ బోరు బావులతోపాటు పోడు భూములను సాగుయో గ్యంగా మార్చి నీటివసతి కల్పిస్తుందని అధికా రవర్గాలు వెల్లడించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha