Telangana-Germany Agreement: శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక (లైఫ్ సైన్సెస్) రంగాలలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది.
జర్మనీలోని ప్రముఖ థూరింగియా (Thuringia) రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సరికొత్త అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. భారత్ పర్యటనలో భాగంగా థూరింగియా మినిస్టర్ – ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీ (MCRHRD) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Read also:Telangana Land Value : ఈ విధంగా తెలంగాణలో ల్యాండ్ వాల్యూ పెంపు !!
ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామి: మారియో ఫోకట్
భారత్-జర్మనీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్న వేళ, అభివృద్ధి మరియు సరికొత్త ఆవిష్కరణలలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని మారియో ఫోకట్ కొనియాడారు. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ సరికొత్త ప్రస్థానం పారిశ్రామిక, విద్యా రంగాల పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Telangana-Germany Agreement: గ్లోబల్ మార్కెట్‌కు తగ్గట్టుగా స్కిల్స్: సీఎం రేవంత్ రెడ్డి
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత గ్లోబల్ టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ అవకాశాలను శాసిస్తోందని, అందుకు అనుగుణంగానే విద్యా విధానంలో మార్పులు రావాలని స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక అవసరాలను తీర్చేలా మన యువతకు నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ విద్యాసంస్థల సిలబస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించడంలో జర్మనీ సాంకేతిక సహకారం అందించాలని కోరారు. దీనిపై థూరింగియా మినిస్టర్ సానుకూలంగా స్పందిస్తూ అవసరాల ఆధారిత శిక్షణా వ్యవస్థను ఉమ్మడిగా డిజైన్ చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్
ప్రపంచ సాంకేతిక రంగంలో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ వంటి గ్లోబల్ టెక్ హబ్‌లలో హైదరాబాద్ మానవ వనరుల పాత్ర అద్భుతమైనదని సీఎం గుర్తుచేశారు. జర్మనీ కంపెనీలకు భవిష్యత్తులో అవసరమయ్యే హ్యూమన్ రీసోర్సెస్‌ను ముందే గుర్తిస్తే, వారికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సీఎం ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, విదేశీ భాషా నైపుణ్యాల కోసం థూరింగియా రాష్ట్ర సహకారంతో హైదరాబాద్‌లో ఒక ‘జర్మన్ భాషా శిక్షణ కేంద్రం’ ఏర్పాటు చేయాలని కోరారు.
ఫ్యూచర్ సిటీయే టార్గెట్.. మిస్ వరల్డ్ ఆతిథ్యంపై ప్రస్తావన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ఫార్చూన్-500 కంపెనీలను ఆకర్షించేందుకు అనువైన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ, సుమారు 100కు పైగా దేశాల ప్రతినిధులు విచ్చేసిన మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

