Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదీ.. ఐదే రోజుల్లో 315 కోట్లు కొల్లగొట్టిన పెద్ది!

గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదీ.. ఐదే రోజుల్లో 315 కోట్లు కొల్లగొట్టిన పెద్ది!

వార్త 2 months ago

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బాక్సాఫీస్ భంజనానికి మరోసారి దేశీయ చిత్ర పరిశ్రమ షేక్ అవుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ అల్టిమేట్ కలెక్షన్ల హవాతో రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన 'ఫాస్టెస్ట్ సోలో మూవీ'గా 'పెద్ది' బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసింది.

Read also:Peddi: 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. చిత్రబృందం ఘనంగా నిర్వహించిన థాంక్యూ మీట్

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల 'పెద్ది' విధ్వంసం

 Ram Charan's 'Peddi' Storms Into Rs 300 Crore Club In Just 5 Days!

ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ వండర్ తర్వాత రామ్ చరణ్ నటనకు, బుచ్చిబాబు రాసిన రా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తోడవడంతో ఫ్యాన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా వర్కింగ్ డేస్‌లో ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్ (నార్త్ అమెరికా), నార్త్ ఇండియా బెల్ట్ అంతటా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్‌కు తోడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తోందని ప్రేక్షకులు చెప్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

'పెద్ది' సినిమా బృందంపై అట్రాసిటీ కేసుకు డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha