Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుచ్చకాయ తిని బాలుడు మృతి? నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!

పుచ్చకాయ తిని బాలుడు మృతి? నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!

వార్త 3 months ago

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక సంతోషకరమైన వివాహ వేడుక విషాదాంతమైంది. పెళ్లి విందు ఆరగించిన కొద్దిసేపటికే ఫుడ్ పాయిజనింగ్ సంభవించి ఒక బాలుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గుర్కోడ్ గ్రామంలో చోటుచేసుకుంది.బాధితులంతా తమ మేనమామ వివాహ వేడుకలో పాల్గొనేందుకు గుర్కోడ్ గ్రామానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భోజనం చేసిన చిన్నారులు, ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నట్లు సమాచారం.

Read Also:Bandi Bhagirath POCSO Case: చట్టం ఎవరికీ చుట్టం కాదు: బండి సంజయ్ భావోద్వేగం

చికిత్స పొందుతూ అఖిలేశ్ మృతి

అయితే, తిన్న రెండు గంటలకే చిన్నారులందరికీ తీవ్రంగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిలేశ్ ధివార్ అనే బాలుడు ప్రాణాలు విడిచాడు. మిగిలిన నలుగురు చిన్నారులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారు కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

 Chhattisgarh News

Chhattisgarh: పుచ్చకాయే కారణమా? దర్యాప్తు ప్రారంభం

పుచ్చకాయ తినడం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పెళ్లిలో వడ్డించిన ఆహార నమూనాలను, ముఖ్యంగా పుచ్చకాయ ముక్కలను సేకరించారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు.ఆహారంలో రసాయనాలు కలిశాయా లేదా పుచ్చకాయ పాడైపోవడం వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నీట్-యూజీ 2026 పేపర్ లీక్: నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha