Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్-యూజీ 2026 పేపర్ లీక్: నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్ట్!

నీట్-యూజీ 2026 పేపర్ లీక్: నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్ట్!

వార్త 3 months ago

NEET Paper Leak Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మహారాష్ట్ర పోలీసులు కీలక పురోగతి సాధించారు.

నాసిక్‌కు చెందిన ఒక బీఏఎంఎస్ విద్యార్థిని ఈ కుంభకోణంలో భాగస్వామిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also:Bandi Bhagirath POCSO Case: చట్టం ఎవరికీ చుట్టం కాదు: బండి సంజయ్ భావోద్వేగం

NEET Paper Leak Case: రూ. 10 లక్షలకు ‘గెస్ పేపర్’ కొనుగోలు

నిందితుడిని శుభమ్ ఖైర్నార్‌గా పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా దాదాపు రూ. 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈయన ‘గెస్ పేపర్’ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం కొనుగోలు చేయడమే కాకుండా, ఆ పేపర్‌ను హర్యానాకు చెందిన మరో వ్యక్తికి విక్రయించి నగదు ఆర్జించినట్లు నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది.

 NEET Paper Leak Case Arrest

ఇదిలా ఉంటే ఈ లీక్ పేపర్‌ను అందుకున్న 150 మంది విద్యార్థులు, 70 మంది తల్లిదండ్రుల జాబితాను సీబీఐ అందుకుంది.ప్రస్తుతం కస్టడీలో ఉన్న 13 మంది ఎంబీబీఎస్ కౌన్సిలర్లను కూడా పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్ కౌన్సిలర్లు చెబుతున్నదాని ప్రకారం.. నీట్ గరిష్ట కట్ ఆఫ్ 600 పాయింట్లు, లీకైన పేపర్‌లో కూడా 600 పాయింట్లకు సమానమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ 600 మార్కులు వస్తే దేశంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ పొందినట్లే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అగ్నిమాపక శాఖలో 1,275 పోస్టుల భర్తీకి హోంమంత్రి అనిత గ్రీన్ సిగ్నల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha