Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

వార్త 3 months ago

Gold rate today : బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. గత వారం భారీ హెచ్చుతగ్గులు నమోదైన తర్వాత సోమవారం మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు స్వల్పంగా తగ్గిన ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపిస్తోంది.

భారత్‌లో బంగారానికి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ధరలు తగ్గినా, ప్రస్తుతం హెచ్చుతగ్గుల మధ్య ట్రేడింగ్ కొనసాగుతోంది. గత వారం వరుసగా పెరిగిన ధరలు గురు, శుక్రవారాల్లో తగ్గగా, శనివారం మళ్లీ పెరిగాయి. ఆదివారం ట్రేడింగ్ లేకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి.

Phone Pay: ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులం ధర సుమారు ₹1,44,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,57,750గా ఉంది. వెండి ధర గత వారం నుంచి పెద్దగా మార్పు లేకుండా కేజీకి సుమారు ₹2.80 లక్షల వద్ద ట్రేడవుతోంది. జనవరి చివర్లో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి వెండి ధర గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha