Google Pay SBI Card: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్ (SBI Card), డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ గూగుల్ పే (Google Pay) తో భాగస్వామ్యం కుదుర్చుకుని 'Google Pay-SBI కార్డ్' పేరిట కొత్త ఫ్లెక్స్ కార్డ్‌ను అధికారికంగా ప్రారంభించింది.
రోజువారీ డిజిటల్ లావాదేవీలను వినియోగదారులకు మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రతి ఖర్చుపై అదనపు లబ్ధి చేకూర్చేలా ఈ కార్డును డిజైన్ చేశారు.
Read Also : UPI Auto Mandate: జాగ్రత్త.. ఫ్రీ ట్రయల్స్ తో మోసం.. క్యాన్సిల్ చేయకపోతే డబ్బులు కట్
Google Pay-SBI New Credit Card Launched - Here's How to Apply
Google Pay SBI Card: వార్షికంగా 18,000 స్టార్స్ రివార్డ్ పాయింట్లు
ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి రోజువారీ అవసరాలైన కిరాణా సామగ్రి, కరెంట్ లేదా ఇంటర్నెట్ బిల్లులు, ప్రయాణ ఖర్చులు మరియు ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిపై భారీగా రివార్డులు పొందవచ్చు. వినియోగదారులు సంవత్సరానికి గరిష్టంగా 18,000 స్టార్స్ రివార్డ్ పాయింట్లను (Stars Reward Points) సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా, పెద్ద మొత్తంలో చేసిన ఖర్చులను లేదా బకాయి బిల్లులను సులభ వాయిదాల (EMI) రూపంలోకి మార్చుకునే అత్యుత్తమ సౌలభ్యం కూడా ఇందులో ఉంది.
యాప్‌లోనే దరఖాస్తు.. నెట్‌వర్క్ ఎంపిక మీదే!
ఈ కార్డు కోసం ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా గూగుల్ పే (Google Pay) యాప్‌లోనే కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, చెల్లింపులు చేయడం, కార్డ్ స్టేట్‌మెంట్‌లు చూడటం మరియు ఖాతాను నిర్వహించడం (Manage Account) వంటివన్నీ యాప్ ద్వారానే నిర్వహించవచ్చు. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్ వినియోగదారుల సౌకర్యార్థం RuPay, VISA రెండు ప్రముఖ నెట్‌వర్క్‌లపై అందుబాటులో ఉంది.
ఇథనాల్ లేకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ.125.. కేంద్రం సంచలన వెల్లడి

