Dailyhunt
గౌతమ్ గంభీర్ 'డీప్‌ఫేక్' వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

గౌతమ్ గంభీర్ 'డీప్‌ఫేక్' వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

వార్త 3 weeks ago

Gautam Gambhir: టీమ్‌ఇండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ దాఖలు చేసిన సివిల్ సూట్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గంభీర్ పేరు, ఫోటో, వాయిస్ మరియు ఇతర వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) అనుమతి లేకుండా ఉపయోగించడాన్ని కోర్టు తప్పుబట్టింది.

ఏఐ (AI) టెక్నాలజీని వాడుతూ గంభీర్ ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన కంటెంట్‌పై జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also:Yograj Singh: క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వారే కారణం: యోగరాజ్ సింగ్

ఆయన ఫొటో, వాయిస్‌తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను సృష్టించిన వారి వివరాలు అందించాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

 Gautam Gambhir Personality Rights

Gautam Gambhir: పిటిషన్ లో ఏం పేర్కొన్నారు?

దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన సివిల్ దావాలో గంభీర్ తన వ్యక్తిత్వ పరిరక్షణతోపాటు రూ. 2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అటువంటి డీప్ ఫేక్ కంటెంట్ ను, తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. “ఇది కేవలం వ్యక్తిత్వ హననం మాత్రమే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్న సమయంలో చట్టం, గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి. నా గుర్తింపు, నా పేరు, నా గొంతుకను ఆయుధాలుగా ఉపయోగించి అనధికారిక ఖాతాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోంది. నా పేరు వినియోగించి ఆదాయం ఆర్జించడం జరుగుతోంది" అని గంభీర్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళ రాజకీయాల్లోకి దర్శకుడు సుందర్ సీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha