Yograj Singh: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. నిత్యం ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే ఆయన, ఈసారి ఏకంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆటగాళ్లు తమ కెరీర్‌ను ముగించడానికి వారి ఫిట్‌నెస్ కంటే, వారి భార్యలు ఇచ్చే సలహాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొనడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల వృత్తిపరమైన జీవితంలో మహిళలు జోక్యం చేసుకోకూడదని అభిప్రాయపడ్డారు. ఇంట్లోని మహిళలు, భార్యలు తమ భర్తలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెడతారు. రిటైర్మెంట్ తీసుకోమని, ఇక చాలు.. కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని ఒత్తిడి తెస్తుంటారు. ఇలాంటి అనవసర సలహాల వల్లే చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు తమ కెరీర్‌ను మధ్యలోనే వదిలేస్తున్నారు అని ఆయన ఘాటుగా విమర్శించారు.
Read Also : Pat Cummins Fitness Update: ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై కోచ్ వెటోరీ క్లారిటీ
Yograj Singh makes sensational comments on cricketers’ retirements.
Yograj Singh: వయస్సు, ఫిట్‌నెస్‌పై అనుచిత వ్యాఖ్యలు
భారత్‌లో 40 ఏళ్లు రాగానే వయసైపోయిందంటారు. 30 ఏళ్లు దాటగానే మహిళలు తమ ఫిట్‌నెస్‌ను, ఆకృతిని కోల్పోతారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని, ఇక మేమేం చేయగలమని తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాయి.
గతంలో ధోనీ, కపిల్ దేవ్ వంటి దిగ్గజాలపై విమర్శలు చేసిన యోగరాజ్ సింగ్, ఇప్పుడు ఏకంగా మహిళల వ్యక్తిత్వాన్ని, క్రికెటర్ల కుటుంబ నిర్ణయాలను తప్పుబట్టడం చర్చకు దారితీసింది. ఆయన వ్యాఖ్యలపై అటు క్రీడాకారులు గానీ, ఇటు యువరాజ్ సింగ్ గానీ ఇంకా స్పందించలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఎత్తివేసిన బంగ్లాదేశ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే!

