Lalit Modi on Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా ప్రవర్తన మరోసారి ఐపీఎల్ వర్గాల్లో సంచలనం అయ్యింది.. 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓటమి అనంతరం, మైదానంలోనే కెప్టెన్ రిషభ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్‌లతో ఆయన సీరియస్‌గా చర్చించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందిస్తూ, గోయెంకాను బ్యాన్ చేయాలని, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని తొలగించాలని డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది.
Read Also:CSK vs PBKS: చెపాక్‌లో చెన్నై 'సూపర్' ఫైట్.. పంజాబ్‌తో పోరులో బోణీ కొట్టేనా?
Lalit Modi on Sanjiv Goenka: లలిత్ మోదీ ఘాటు స్పందన
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో లలిత్ మోదీ స్పందిస్తూ.. “ఈ వ్యక్తి ప్రవర్తన చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను ఉండుంటే వెంటనే అతన్ని బ్యాన్ చేసి, జట్టు యాజమాన్యాన్ని కూడా తొలగించేవాడిని. ఫ్రాంఛైజీ ఒప్పందంలో దీనికి సంబంధించి ఒక క్లాజ్ ఉంది. బీసీసీఐ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ” పోస్ట్ చేశాడు.
మొత్తానికి సంజీవ్ గోయెంకా బిహేవియర్‌పై రోజురోజుకూ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఐపీఎల్‌లోని ఏ జట్టుకు లేని విధంగా ఓనర్‌తో లక్నో కెప్టెన్లు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభానికి ముందు తాను మారుతున్నట్లు చెప్పిన గోయెంకా మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత యథావిధిగా కెప్టెన్-కోచ్‌తో చిట్‌చాట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

