Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న డీకే శివకుమార్‌

జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న డీకే శివకుమార్‌

వార్త 3 weeks ago

DK Shivakumar to take oath : కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

జూన్ 3వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

జ్యోతిష్యుడి సలహాతోనే ముహూర్తం ఫిక్స్

డీకే శివకుమార్‌కు దైవభక్తి, జ్యోతిష్యంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ క్రమంలోనే ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించి, శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు టాక్. జూన్ 3న ప్రమాణస్వీకారం చేస్తే రాజకీయంగా తిరుగుండదని జ్యోతిష్యులు సూచించడంతో ఆయన ఆ తేదీకే మొగ్గు చూపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భారీ హంగు ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా నిర్వహించాలని డీకే భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.

Read Also: NEET paper leak Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. బాధ్యులు ఎవరో తేల్చాల్సిందే!

 DK Shivakumar to take oath

DK Shivakumar to take oath : గవర్నర్‌తో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ

ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు, తేదీపై చర్చించేందుకు డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈరోజు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌తో సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ఇందులో భాగంగా పూర్తి చేయనున్నారు. గురువారం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఈ భేటీతో పూర్తిగా తెరపడనుంది. మరోవైపు బెంగళూరులో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) సమావేశం జరగనుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి డీకే శివకుమార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇది కేవలం లాంఛనమేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గానికి చెందిన కీలక నేతలకు మంత్రివర్గంలో ఎలా సర్దుబాటు చేయాలి, ఏయే పోర్ట్‌ఫోలియోలు కేటాయించాలనే అంశంపై ఢిల్లీ వేదికగా ముమ్మర చర్చలు సాగుతున్నాయి. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ మంత్రివర్గాన్ని కూర్చే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సిద్దరామయ్య మాస్టర్ ప్లాన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha