Medak News: గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.
గురువారం నాడు శంకరంపేట తో పాటు మండల పరిధిలోని బూరుగుపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోపలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద శంకరంపేటలో 34 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, 10 లక్షల రూపాయలతో కేజీబీవీకి డ్రైనేజీ తో పాటు సిసి రోడ్డు పనులకు, మండల పరిధిలోని మక్తా లక్ష్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
Government prioritizes rural development: Narayankhed MLA Sanjeeva Reddy
అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.. అదేవిధంగా మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాము నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాము ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
Read Also: Mahesh Kumar Goud: కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఫైర్

Medak News: రాజీవ్ గాంధీకి ఘన నివాళి
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆధునిక యుగం వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. టెలికాం, కంప్యూటర్, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన నాంది పలికారన్నారు.
18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు దానం పల్లినారాగౌడ్, మురళి పంతులు, R.N సంతోష్ కుమార్, సుభాష్ గౌడ్, బాసాడ రాజు, సుభాష్, కుంట్ల రాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుమాల్గౌడ్, సర్పంచులు జంగం రేణుక, శ్రీనివాస్, వెంకట్రావు, విట్టల్, ఉప సర్పంచ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com
మారుతున్న నేరాల స్వభావం: తెలంగాణ పోలీసు శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

