AP govt employees salary:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గతంలో కొన్ని ప్రాంతాలలో జీతాలు ఆలస్యం కావడంపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం వెలువడింది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో బిల్లులు సిద్ధం చేయాలని కోరింది. ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. అన్ని కార్యాలయాల హెడ్స్ బాధ్యతగా వ్యవహరించి జీతాల ప్రక్రియ వేగవంతం చేయాలి.
Read also: Joorala Gates Open: శ్రీశైలానికి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
Good news for AP employees.
ఐఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ పూర్తి
రాష్ట్రంలోని వివిధ కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే ఐఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని ఆర్థిక శాఖ తెలిపింది. బిల్లులు సమయానికి పంపకపోతే సంబంధిత డీడీవోలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం మూడు వేల తొమ్మిది వందల మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు ఇంకా అప్‌డేట్ కాలేదని గుర్తించారు. వీరిలో సుమారు వెయ్యి తొమ్మిద వందల మంది ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సచివాలయానికి వెళ్లి క్లియర్ చేసుకోవాలని సూచించారు.
AP govt employees salary:ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ నెల మొదటి రోజే జీతాలు
కేంద్ర ప్రాయోజిత పథకాలలో పనిచేస్తున్న దాదాపు లక్ష మంది ఉద్యోగుల జీతాల నిధులు రాబట్టాల్సిన బాధ్యత శాఖాధిపతులదే. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. జూలై ముప్పై లోపు బిల్లులు పంపని పక్షంలో డీడీవోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవా కాలం పొడిగింపు జరగడంతో బిల్లులు వెంటనే సమర్పించాలి. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఉద్యోగులకు సకాలంలో వేతనాలు
Epaper: epaper.vaartha.com

