Dailyhunt
Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!

Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!

వార్త 2 months ago

గుంటూరు జిల్లా(Guntur crime) నల్లపాడు పోలీస్‌ స్టేషన్ పరిధిలో భర్త ఆత్మహత్యకు సంబంధించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏటి అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు-వెంకటరమణ దంపతులు.

అయితే కుటుంబ జీవనంలో ఏర్పడిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు

మృతుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్య(Suicide)కు ముందు ఓ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశాడు. అందులో తన భార్య వెంకటరమణకు లాయర్ బాలాజీతో వివాహేతర సంబంధం ఉందని, విడాకుల కోసం రూ.20 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోందని ఆరోపించాడు. అలాగే తనపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తానని చెప్పి వేధింపులకు పాల్పడుతోందని పేర్కొన్నాడు.

ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Karnataka: చైనా మాంజా కలకలం.. మరో వ్యక్తి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha