Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరోగసి స్కామ్: డాక్టర్ నమ్రత పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!

సరోగసి స్కామ్: డాక్టర్ నమ్రత పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!

వార్త 3 months ago

Srusti Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణంలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వైద్య వృత్తికే తలవంపులు తెచ్చేలా ఉందని ధర్మాసనం మండిపడింది.

Read Also:Bandi Bhagirath POCSO Case Update: బండి భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్! పరారీలో బండి సంజయ్ కుమారుడు?

కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా..

2024 జూలైలో రాజస్థాన్‌కు చెందిన దంపతులు హైదరాబాద్‌ గోపాలపురం పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం బయటపడింది.సరోగసి ద్వారా బిడ్డను ఇస్తామని నమ్మించి రూ. 35 లక్షలు వసూలు చేశారు.వేరే బిడ్డను అప్పగించగా, డీఎన్‌ఏ పరీక్షలో ఆ శిశువుకు తమకు సంబంధం లేదని తేలింది.ఈ ఘటన తర్వాత తెలంగాణ, ఏపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల నుంచి బాధితులు ఫిర్యాదు చేయడంతో 15కు పైగా కేసులు నమోదయ్యాయి.

 Dr Namrata Surrogacy Scam Supreme Court

Srusti Fertility Centre Scam: ఈడీ ఎంట్రీ.. రూ. 30 కోట్ల ఆస్తులు గుర్తింపు

ఈ కేసులో ఆర్థిక లావాదేవీల కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. డాక్టర్ నమ్రతకు చెందిన రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడమే కాకుండా, 8 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2026 ఫిబ్రవరి 13న ఆమెను అరెస్టు చేయగా, తన అరెస్టు చట్టవిరుద్ధమని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సంగారెడ్డి నేషనల్ హైవేపై మంటలు: కెమికల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha