Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి గ్రామ శివారులో సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కోర్పోలుకు చెందిన కోరబోయిన ఉదయ్ కిరణ్ (24) మృతి చెందారు.
ఉదయ్ కిరణ్ తన మోటారు బైక్ పై స్వగ్రానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కొర్పోల్ సర్పంచ్ బచ్చుగూడెం సునీతప్రవీణ్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Maharastra Crime: దొంగతనాలకు అలవాటుపడ్డ కూతుళ్లు.. రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి..
Sangareddy Road Accident: Youth dies after being hit by an unidentified vehicle
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

