Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గురుకుల నాన్ టీచింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

గురుకుల నాన్ టీచింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

వార్త 3 weeks ago

AP Gurukula Teachers:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును అరువది ఏళ్ల నుంచి అరువది రెండు ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమ శాఖ జీఓ 33 తీసుకువచ్చింది.

ఈ ఏడాది జులై నుంచి రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read also: APMEPMA: డ్వాక్రా మహిళలకు ఏకంగా రూ.13 లక్షల రుణం

 Retirement age of Gurukul employees increased

పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ షరతులు

ఉద్యోగ విరమణ వయసు పొడిగింపుపై ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టింది. మళ్లీ విధుల్లో చేరే సమయానికి వేతన బకాయిలు ఇవ్వడం జరగదని అధికారులు తెలిపారు. ఒకవేళ ఇప్పటికే గ్రాట్యుటీ అలాగే పెన్షన్ తీసుకుని ఉంటే జీఓ 45 ప్రకారం వాటిని రికవరీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

AP Gurukula Teachers:సర్వీస్ రూల్స్ సవరణతో గురుకుల సిబ్బందికి లబ్ధి

గిరిజన సంక్షేమ గురుకులాల సిబ్బంది సర్వీస్ రూల్స్ సవరిస్తూ తగు ఆదేశాలు వెలువడ్డాయి. దీనివల్ల వందలాది మంది ఉపాధ్యాయులకు అలాగే సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రిటైర్మెంట్ దశలో ఉన్న ఉద్యోగులకు సర్వీస్ పొడిగింపు రూపంలో గొప్ప ఉపశమనం లభించినట్లయింది.

Epaper: epaper.vaartha.com

దూకుడు పెంచిన విజయ సాయి రెడ్డి..జగన్ , బాబు లపై ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha