Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గురువుగా శివన్న.. శిష్యుడిగా చరణ్: 'పెద్ది' నుంచి మాస్ అప్‌డేట్

గురువుగా శివన్న.. శిష్యుడిగా చరణ్: 'పెద్ది' నుంచి మాస్ అప్‌డేట్

వార్త 1 week ago

Peddi Movie Update: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (గతంలో RC16) అంచనాలను మించిపోతోంది.

ఈ సినిమాలో కన్నడ సెన్సేషన్ శివరాజ్ కుమార్ పోషిస్తున్న పాత్రపై మేకర్స్ ఒక పవర్‌ఫుల్ వీడియోను వదిలారు. ఇందులో ఆయన గౌరి నాయుడు అనే గంభీరమైన పాత్రలో కనిపిస్తున్నారు.

Read Also:Mouni Roy: భర్త సూరజ్‌ నంబియార్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన నటి మౌనీ రాయ్

Peddi Movie Update: కుస్తీ గురువుగా శివన్న?

తాజా వీడియోలో శివరాజ్ కుమార్ కుస్తీ పట్లు పడుతూ, ఒళ్లు గగుర్పొడిచే ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ కుస్తీ వీరుడిగా కనిపిస్తుండగా, ఆయనకు శిక్షణ ఇచ్చే గురువు పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన "చికిరి చికిరి", "రై రై రా రా" వంటి పాటలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో జానవీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వైరల్ అవుతున్న సాయి పల్లవి 'ఏక్ దిన్' ఫొటోలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha