Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుత్తిలో రూ. 95 లక్షలతో పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ!

గుత్తిలో రూ. 95 లక్షలతో పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ!

వార్త 2 months ago

Gooty Petrol Bunk: జిల్లావ్యాప్తంగా పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కృషి చేస్తున్నామని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ పేర్కొన్నారు.

గుత్తి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి ఆయన భూమి పూజ గావించారు. పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు భారత్ పెట్రోల్ కార్పోరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో 95 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 45 రోజుల్లో నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఇలియాజ్ భాష , గుంతకల్ డిఎస్పి శ్రీనివాస్, ఏఆర్ డిఎస్పి నీలకంఠేశ్వర్ రెడ్డి, బీపీసీఎల్ సేల్స్ మేనేజర్ లక్ష్మి, అర్బన్ సీఐ రామారావు, ఎస్సైలు సురేష్, అమీర్ ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read also: Operation H-FAST: హైదరాబాద్ టు ఏపీ వందల టన్నుల చికెన్ వ్యర్థాలు సీజ్!

Gooty Petrol Bunk: 95 లక్షలతో అధునాతన సౌకర్యాలు

ఈ ప్రాజెక్టు కోసం పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 95 లక్షల రూపాయలు కేటాయించారు. కేవలం 45 రోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నాణ్యమైన ఇంధనం అందజేయడమే లక్ష్యంగా అత్యాధునిక యంత్రాలతో ఈ బంక్ రూపుదిద్దుకుంటోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha