Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి

పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి

వార్త 6 days ago

Kalyandurg SBI Pensioners: పెన్షనర్లకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసి, వారికి అందుబాటులో ఉన్న ప్రత్యేక సౌకర్యాలను విస్తృతంగా అందించాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సోమవారం కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధాన శాఖ మేనేజర్ సంపత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పెన్షనర్ల కోసం ఎస్‌బీఐ అమలు చేస్తున్న కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ (సీపీపీ) పథకం గురించి విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా పెన్షన్లు పొందుతున్న అర్హులైన పెన్షనర్లందరినీ ఈ పథకం కింద నమోదు చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ పథకం ద్వారా పెన్షనర్లకు కనీస నిల్వ నిబంధన లేకపోవడం, ఎస్‌ఎంఎస్ ఛార్జీల మినహాయింపు, ఏటీఎం కార్డు జారీ రుసుము మాఫీ, వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీతో పాటు అర్హతను బట్టి రూ.30 లక్షల వరకు బీమా ప్రయోజనా లు లభించే అవకాశం ఉందని వారు వివరించారు.

Read also: Seethanagaram news: మన్యం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం

Kalyandurg SBI Pensioners: సీపీపీ పథకంతో పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు

ఈ సౌకర్యాలు ప్రతి పెన్షనర్‌కు చేరేలా బ్యాంకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన చీఫ్ మేనేజర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, పెన్షనర్ల జాబితా మరియు వారి ఖాతా వివరాలను అందజేస్తే అర్హులైన వారందరినీ సీపీపీ పథకం కింద నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్యాంకు నిబంధనల ప్రకారం పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని తెలిపారు. పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించడం పట్ల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యల ద్వారా ప్రాంతంలోని పెన్షనర్లకు మరింత భద్రత, ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి తిప్పే స్వామి, పూర్వాధ్యక్షులు శివప్రసాద్, భగవాన్ దాస్, విజయ్ కుమార్, అంపన్న, ఇస్మాయిల్, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha