Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గువాహటిలో 'రాయల్' వార్.. వర్షం గండం ఉందా?

గువాహటిలో 'రాయల్' వార్.. వర్షం గండం ఉందా?

వార్త 2 months ago

RR vs RCB: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా నేడు (శుక్రవారం, ఏప్రిల్ 10) గువాహటిలోని ఏసీఏ బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య 16వ మ్యాచ్ జరగనుంది.

ఈ సీజన్‌లో ఓటమి అనేది లేకుండా దూసుకుపోతున్న రెండు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది.

Read Also: Mukul Choudhary: నా విజయం వెనుక పంత్ సలహా ఉంది: ముకుల్ చౌదరి

 Rajasthan Royals vs Bangalore

RR vs RCB: గువాహటి వాతావరణం

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడగా, గణాంకాలు ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. ఆర్సీబీ విజయం 17 సార్లు, రాజస్థాన్ విజయం 14 సార్లు, ఫలితం తేలనివి 3 మ్యాచ్‌లు. గువాహటిలో వాతావరణం పట్ల అభిమానుల్లో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటిపూట 20% వర్ష సూచన ఉన్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. బర్సపరా స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అయితే మ్యాచ్ పురోగమించే కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని భావించవచ్చు.

కీలక ఆటగాళ్లు

రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ మంచి ఫామ్‌లో ఉండగా.. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ (RR), భువనేశ్వర్ కుమార్ (RCB)ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ధోనీ స్టైల్‌లో ఫినిషింగ్.. ఎవరీ ముకుల్ చౌదరి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha