Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా విజయం వెనుక పంత్ సలహా ఉంది: ముకుల్ చౌదరి

నా విజయం వెనుక పంత్ సలహా ఉంది: ముకుల్ చౌదరి

వార్త 2 months ago

Mukul Choudhary: భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. కానీ సరైన అవకాశం, మార్గదర్శకత్వం లభించినప్పుడే యువ ఆటగాళ్లు సంచలనాలు సృష్టిస్తారు. లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) యువ బ్యాటర్ ముకుల్ చౌదరి విషయంలో ఇదే జరిగింది.

గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల ముకుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

Read Also: Mukul Choudhary: ధోనీ స్టైల్‌లో ఫినిషింగ్.. ఎవరీ ముకుల్ చౌదరి?

Mukul Choudhary: ముకుల్ చౌదరి అద్భుత ఇన్నింగ్స్

182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ముకుల్, కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అవేశ్ ఖాన్‌తో కలిసి 54 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇందులో విశేషమేమిటంటే, అవేశ్ ఖాన్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగా, మిగిలిన 52 పరుగులు ముకుల్ బాదడం విశేషం. చివరి బంతికి బౌండరీ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘మా నాన్నకు పెళ్లి కాకముందు నుంచే.. తన కొడుకును క్రికెట్ చేయాలని కలలు కన్నాడు. ఆరంభంలో మా ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. 12-13 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. మా ఊరు జుంజులో ఎక్కువ క్రికెట్ అకాడమీలు లేవు. అందుకే జైపూర్‌కు మారాను. టీ20 క్రికెట్ ఎదుగుదల చూసి గుర్గావ్‌కు వెళ్లి అక్కడ 3-4 నెలలు ఉన్నాను.

 Mukul Choudhary’s brilliant innings

“గతంలో మ్యాచ్‌లను ముగించడానికి చాలా తొందరపడేవాడిని. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటంపై దృష్టి పెట్టాను. ఆటను చివరి వరకు తీసుకెళ్తే గెలిపించగలనని నమ్ముతున్నా” అని తెలిపాడు.”గత మ్యాచ్‌లో సరిగా టైమింగ్ చేయలేకపోయాను. దాంతో రిషబ్ భాయ్‌తో మాట్లాడాను. ‘నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. నీ పనిపై దృష్టి పెట్టు. బంతిని చూసి ఆడు. నీపై నాకు నమ్మకం ఉంది. నీపై నీకు కూడా నమ్మకం ఉండాలి’ అని చెప్పాడు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి” అని ముకుల్ వివరించాడు. పంత్ ఇచ్చిన భరోసాతోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజమైన ఆట ఆడి జట్టును గెలిపించగలిగానని ముకుల్ పేర్కొన్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

లక్నోకు షాక్.. ఐపీఎల్ మొత్తానికి హసరంగ దూరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha