Dailyhunt
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

వార్త 1 week ago

TGSRTC DA Hike 2026: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది.

Read Also : Karimnagar: కరీంనగర్‌ పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. మరణించిన వారికి జీతాలు!

 Government good news for Telangana RTC employees

TGSRTC DA Hike 2026: 52.8 శాతానికి చేరిన డీఏ

తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా 2025 జులైలో 2.1 శాతం డీఏ పెంచగా (అప్పుడు 48.6 శాతం నుండి 50.7 శాతానికి పెరిగింది), ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మరో విడత పెంపును అమలు చేసింది.

బకాయిల చెల్లింపు ఇలా..

గడిచిన మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో నెలకు సంబంధించి విడివిడిగా ఈ బిల్లులను రూపొందించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha