HYD Kanchanbagh Incident: హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం 16 నెలల వయసున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డ కళ్లముందే అనంతలోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర గుండెకోత మిగిలింది.
Read Also : Rajavommangi crime: ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం
Tragic accident in Hyderabad: Toddler dies after falling into a bucket of water.
HYD Kanchanbagh Incident: పనుల్లో తల్లిదండ్రులు.. ప్రమాదంలో చిన్నారి
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సదరు కుటుంబం అర్ధరాత్రి సమయంలో తమ ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి, అక్కడ నీటితో నింది ఉన్న బకెట్ వైపు వెళ్ళింది. బకెట్లోకి తొంగిచూసే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది.
కొంత సమయం తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు, బకెట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు. అయితే, చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కంటిముందే అప్పటివరకు నవ్వుతూ ఆడుకున్న చిన్నారి శవమై కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన కంచన్‌బాగ్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

