Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో జనసేన సభ రద్దు.. పోలీసుల దెబ్బకు కోర్టులోనూ నిరాశే!

హైదరాబాద్‌లో జనసేన సభ రద్దు.. పోలీసుల దెబ్బకు కోర్టులోనూ నిరాశే!

వార్త 2 months ago

Pawan Kalyan Hyderabad PressMeet: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ("తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం") నిర్వహించాలనుకున్న జనసేన పార్టీకి తెలంగాణ హైకోర్టులో గట్టి చుక్కెదురైంది.

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజే (మంగళవారం) సభ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకోగా, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ సెల్ దాఖలు చేసిన హౌస్ మోషన్ (అత్యవసర) పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Read Also :Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Pawan Kalyan Hyderabad PressMeet: శాంతిభద్రతల కారణాలతో పోలీసుల బ్రేక్

 Setback For Jana Sena

తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా దాదాపు 2,000 మంది ముఖ్య నేతలతో ఈ అంతర్గత సభ నిర్వహించాలని జనసేన భావించింది. అయితే, గచ్చిబౌలి ఐటీ హబ్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడం మరియు ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనపై కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో శాంతిభద్రతల (Law & Order) సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సైబరాబాద్ (శేరిలింగంపల్లి జోన్) పోలీసులు సభకు అనుమతిని నిరాకరించారు.

హైకోర్టులో జనసేనకు నిరాశ - కేవియట్ పిటిషన్ లింక్

పోలీసుల రిజెక్షన్ ఆర్డర్‌పై జనసేన మంగళవారం ఉదయం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం, ఇందులో ఇప్పటికిప్పుడు అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత (Urgency) లేదని స్పష్టం చేసింది. "కావాలనుకుంటే రెగ్యులర్ విధానంలో వెకేషన్ బెంచ్ (Vacation Bench) ముందు ఈ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు" అని పేర్కొంటూ హౌస్ మోషన్‌ను రిజిస్ట్రీ తిరస్కరించింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సభకు అనుమతులు ఇవ్వకూడదంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ముందే కోర్టులో కేవియట్ (Caveat) పిటిషన్ దాఖలు చేయడం కూడా ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

హైకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో గచ్చిబౌలి సభ పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక సంచలన పోస్ట్ చేశారు. "ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో విలేకరుల సమావేశం (Press Meet) నిర్వహిస్తాను. మా నాయకులతో కలిసి నిర్వహించే ఈ ప్రెస్‌మీట్‌కైనా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందో.. లేదో.. చూద్దాం!" అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సభ రద్దయిన నేపథ్యంలో సాయంత్రం జరగబోయే పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా?.. పవన్ కల్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha