Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ!

హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో భారీ దోపిడీ!

వార్త 3 months ago

Retired Professor House Robbery: హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్‌లు వరుసగా పాల్పడుతున్న నేరాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన మరువకముందే, తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది.

కౌకూరులో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మిల వద్ద నేపాల్‌కు చెందిన ఒక జంట పనిలో చేరింది. పుట్టినరోజు వేడుకల నెపంతో మురళీధర్ దంపతులను నమ్మించిన ఈ ముఠా, మరో ముగ్గురిని ఇంటికి పిలిపించి వేడుకల హడావుడి చేసింది. ఈ క్రమంలో దంపతులకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని తినిపించి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత చేతులు కట్టేసి ఇంట్లోని బంగారం, నగదు మరియు విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు.

Read Also:Abdul Wahid Khan Case: సనత్ నగర్ బాలుడి హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

Retired Professor House Robbery: పోలీసుల కీలక సూచనలు – అప్రమత్తత

 Medchal Robbery

ఈ తరహా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నగరవాసులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా తమ ఇళ్లలో నేపాలీలను లేదా ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకుంటే, వారి పూర్తి వివరాలను, ఫోటోలను మరియు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో అందజేయాలని ఆదేశించారు. కేవలం నమ్మకం మీద కాకుండా, పనిమనుషుల నేపథ్యాన్ని (Background Check) విచారించిన తర్వాతే ఇంట్లోకి చేర్చుకోవాలని, వారి ప్రవర్తనలో ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha