Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సనత్ నగర్ బాలుడి హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

సనత్ నగర్ బాలుడి హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

వార్త 1 week ago

ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, సహకరించిన వ్యక్తికి పలు శిక్షలు

Abdul Wahid Khan Case: సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం జరిగిన బాలుడు అబ్దుల్వాహిద్ ఖాన్ కిరాతకహత్య కేసులో న్యాయస్థానం చారిత్రా త్మక తీర్పు వెలువరించింది.

ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో బాలుడిని అపహరించి ప్రాణాలు తీసిన ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీఖాన్ అలియాస్ ఫిజాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కమ్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం తుది తీర్పును వెలువరించారు.

Read Also: Nalgonda SC ST Court Verdict: ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

 Accused sentenced to death in 8-year-old child murder case

Abdul Wahid Khan Case: కేసు వివరాలు

కేసు వివరాల్లోకి వెళ్తే.. 2023 ఏప్రిల్ 20న సనత్నగర్ పరిధిలో అబ్దుల్ వాహిద్ ఖాన్ అనే ఆపహరణకు గురై హత్యకు బాలుడు గురయ్యాడు. దీనిపై అదేరోజు సనత్నగర్ 279/ 2023 కింద కేసు నమో దైంది. ప్రధాన నిందితుడు ఏ-1 ఇమ్రాన్ అలీఖాన్ బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి నట్లు పోలీసులు సాక్ష్యా ధారాలను సేకరించారు.

నేరం రుజువు – శిక్షల ఖరారు

హత్య అనంతరం మృత దేహాన్ని మాయం చేయ డంలో ఏ-2 మోహమ్మద్ రఫీక్ సహకరించినట్లు విచా రణలో తేలింది. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కఠినశిక్షలు ఖరారు చేశారు. ప్రధాన నిందితుడు ఏ-1 ఇమ్రాన్అలీ ఖాన్కు ఐపిసి సెక్షన్ 302 కింద మరణశిక్షతోపాటు సెక్షన్ 364 కింద జీవిత ఖైదు, మరికొన్ని ఇతర సెక్షన్ల కింద కఠిన కారాగారశిక్షను విధిస్తూ తీర్పు చెప్పా రు. మృతదేహం తరలింపులో సహకరించిన ఏ-2 మొహమ్మద్ రఫీకక్కు ఐపిసి సెక్షన్ 201, 202 కింద శిక్షలు ఖరారు చేశారు. 2023లో జరిగిన ఈ ఘోర కలికి మూడేళ్లలోపే న్యాయం జరగడం పట్ల మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భార్య కాళ్లు నరికిన కిరాతక భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha