Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో పసిపిల్లల అమ్మకం ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్‌లో పసిపిల్లల అమ్మకం ముఠా గుట్టురట్టు..

వార్త 1 month ago

Child Trafficking in Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అమానుషమైన పసిపిల్లల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను గుజరాత్ పోలీసులు బట్టబయలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇటుకల బట్టీలో సాధారణ కూలీగా పనిచేసిన మురుగన్ అలియాస్ నాగరాజు ఈ దారుణమైన మాఫియాకు బాస్ గా మారాడు. గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఇతడు తన భార్య కృష్ణవేణితో కలిసి చిన్నారులను అంగట్లో సరుకుల్లా మార్చేశాడు. సుమారు 25 మందికి పైగా పసికందులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

Read also: Anantapur crime: ఆరేళ్ల బాలిక గుండెపోటుతో మృతి!

 Infant trafficking mafia gang caught

Child Trafficking in Hyderabad: ఫెర్టిలిటీ సెంటర్ల అండతోనే మాఫియా మాయాజాలం

పిల్లలు లేని దంపతుల ఆశలను ఈ ముఠా పెట్టుబడిగా మార్చుకుంది. సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలు ఈ మురుగన్ గ్యాంగ్‌కు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సెంటర్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విక్రయించిన పిల్లలకు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించడంలో కొందరు డాక్టర్లు, మధ్యవర్తులు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ దందాలో మరికొంతమంది ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

దేశవ్యాప్త నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు

మురుగన్ కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఇతనికి ఉన్న సంబంధాలపై గుజరాత్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అక్రమ వ్యాపారంలో ఉన్న డాక్టర్లు, ఫోర్జరీ పత్రాల ముఠాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అభం శుభం తెలియని పసిపిల్లలను కాపాడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: కూలీల ట్రక్కు బోల్తా, 16 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha