హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధరలు
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా పసిడి ఒక మంచి ఆప్షన్‌గా మారింది. బంగారంతో పాటు వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే గత ఏడాది నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి
సాధారణంగా యుద్ధ వాతావరణం ఏర్పడితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో కొంతకాలం పసిడి ధరలు తగ్గాయి. ఇప్పుడు పరిస్థితులు కొంత సద్దుమణిగిన నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. అయితే అమెరికా తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 16 డాలర్లు పెరిగి 4715 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ప్రస్తుతం ఔన్సుకు 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ మార్కెట్ సెలవు కావడంతో ఈరోజు రిటైల్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
హైదరాబాద్ మార్కెట్లో తాజా రేట్లు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,650 వద్ద అమ్ముడవుతోంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. అయితే గత నాలుగు రోజుల్లోనే వెండి ధర కిలోకు రూ.15,000 వరకు పెరగడం గమనార్హం. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also:Tamilnadu Politics : DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,650గా ఉంది. (Gold Rate Today) గ్రాము ధర రూ.13,965గా కొనసాగుతోంది. నగల కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు వర్తిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. తనిష్క్ జువెలరీలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,010గా ఉండగా, తులం బంగారం ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

